జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలిస్తున్న జేసీ విదేహ్ఖరే
కోవూరు, జనవరి 22 : మండల పరిఽధిలోని గుమ్మళ్ళది బ్బ, నందలగుంటల్లో నిర్మిస్తున్న జగనన్న కాలనీలను శనివారం జేసీ విదేహ్ఖరే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో కొనసాగుతున్న జాప్యానికి గల కారణాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఇళ్ల నిర్మాణాల్ని పూర్తిచే యాల్సిందిగా కోరారు. ఆయన వెంట తహసీల్దారు సీహెచ్ సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి, గృహనిర్మాణ శాఖాధికా రులు, తదితరులు ఉన్నారు.