జగనన్నా.. ఇచ్చిన హామీ నెరవేర్చన్నా!

ABN , First Publish Date - 2021-06-23T06:17:45+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీ మేరకు వైద్య కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి హామీ నెరవేర్చాలని పారా మెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

జగనన్నా.. ఇచ్చిన హామీ నెరవేర్చన్నా!
బొమ్మనహాళ్‌ వైద్యశాల వద్ద కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

కొనసాగిన పారా మెడికల్‌ ఉద్యోగుల నిరసన


బొమ్మనహాళ్‌, జూన 22 : ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఎన్నికల స మయంలో ఇచ్చిన హామీ మేరకు వైద్య కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి హామీ నెరవేర్చాలని పారా మెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు స్థానిక పీహెచసీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన నిరసన మంగళవారం కూడా కొనసాగింది. నాడు ఎన్నికల్లో మాటతప్పం.. మడమ తిప్పం అని చెప్పి, నేడు మాటమరచి మడమ తిప్పారని పారామెడికల్‌ ఉ ద్యోగులు వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగులర్‌ చేసి ఉద్యోగ భ ద్రత కల్పించాలని కోరారు. కొవిడ్‌ బాధిత ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు నిరసనలో వైద్యాధికారి సుల్తానా, సూపర్‌వైజర్‌ యుగంధర్‌, హెల్త్‌ అసిస్టెంట్లు గోవర్ధన, రమణ, నాగేంద్ర, ఏఎనఎంలు ర మాదేవి, విజయలక్ష్మీ పాల్గొన్నారు. 


గుత్తి: ‘హామీలివ్వడమే కాదు.. నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని పారా మెడికల్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మంగళవారం పారామెడికల్‌ ఉద్యోగులు అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం జగన ప్ర తిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పలుమార్లు వైసీపీ అధికారంలోకి వస్తే తమను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వ చ్చి రెండేళ్లవుతున్నా తమ ఊసే ఎత్తడం లేదన్నారు. నిరసనలో ఏపీజీఈ ఏ గుత్తి మండల అధ్యక్షుడు మక్బుల్‌ సాబ్‌, పారామెడికల్‌ కాంట్రాక్టు ఉ ద్యోగులు రామకృష్ణ, ఆంజినేయులు, వన్నూరువలి, జఫ్రూల్లా, జగన, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


ఉరవకొండ: వైద్య ఆరోగ్య శాఖలో 2001 నుంచి పనిచేస్తున్న కాంట్రా క్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని పారామెడికల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. స్థానిక సీహెచసీ ఆసుపత్రి వద్ద మోకాళ్లపై నిల్చొని మంగళవా రం నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మేనిఫెస్టో హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. నిరసనలో ఉద్యోగులు ప్రసాద్‌, వెంకటే్‌షలు, సంపత, వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:17:45+05:30 IST