కదిలి వచ్చిన జగన్నాథుడు

ABN , First Publish Date - 2022-07-02T06:39:37+05:30 IST

శ్రీ జగన్నాథస్వామి దివ్య రఽథ చక్రాలు లక్ష్మిపురం ఆలయం నుంచి శ్రీ వారి క్షేత్రం వైపునకు కదిలాయి.

కదిలి వచ్చిన జగన్నాథుడు

ద్వారకా తిరుమల, జూలై 1 : శ్రీ జగన్నాథస్వామి దివ్య రథ చక్రాలు లక్ష్మిపురం ఆలయం నుంచి శ్రీ వారి క్షేత్రం వైపునకు కదిలాయి. అతి పురాతనమైన ఈ ఆలయం శ్రీ వారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమై విరాజి ల్లుతోంది. ఈ క్రమంలో జగ న్నాఽథుని రఽఽథోత్సవాలు శుక్రవా రం నుంచి ప్రారంభమై ఈ నెల 10 వరకూ జరగనున్నా యి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్ప మాలికలు, విద్యుత్‌ దీపతోరణాలతో సుందరీకరించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ సుభద్ర, బలభద్ర, సమేత జగన్నాధుని ఉత్సవ, దారు విగ్రహాలను అట్టహాసంగా కోవెల నుంచి తెచ్చి రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై ఉంచి అలంకరించారు. అధికారుల పూజల అనంతరం రథయాత్రను ప్రారంభించారు. మేళతాళాలు, సన్నాయి డప్పు వాయిద్యాలు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు, కోలాట భజనల నడుమ జగన్నాధ రథయాత్ర ద్వారకా తిరుమల క్షేత్రానికి చేరుకుంది. ప్రతి ఇంటి ముందు జగన్నాథుడికి భక్తులు హారతులు పట్టారు. 




Updated Date - 2022-07-02T06:39:37+05:30 IST