విధ్వంసకర పాలనతో.. విభజనకు మించిన నష్టం!

ABN , First Publish Date - 2022-01-05T08:39:34+05:30 IST

జగన్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్ర విభజన వల్ల జరిగిన దానికంటే ఎక్కువ నష్టం జరిగిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్‌ వల్ల..

విధ్వంసకర పాలనతో.. విభజనకు మించిన నష్టం!

  • ప్రజావేదికతో ధ్వంసం మొదలు
  • అమరావతి, పోలవరం, ప్రాజెక్టులు, రోడ్లు, ఇళ్లు, విద్య, సాగు వరకూ!
  • జగన్‌ పేదల ద్రోహి, అబద్ధాలకోరు.. ఇప్పటికి 3.86 లక్షల కోట్ల అప్పు
  • ఈ మొత్తం అవినీతి కోసమే.. సంక్షేమానికి కానే కాదు
  • తెచ్చిన అప్పుల్లో సంక్షేమ ఖర్చుపై శ్వేతపత్రమిచ్చే దమ్ముందా?
  • కేసులే ఢిల్లీ టూరు ఎజెండా.. పోలవరం ఎప్పటికయ్యేను?
  • కట్టడం వీళ్లకు చేతనవుతుందా?.. నవరత్నాలకు పదింతలు చేశాం
  • అవన్నీ ఈ సీఎం తీసేశాడు.. 32 నెలల్లో 32 ఏళ్లు వెనక్కి
  • జాబ్‌ కేలెండర్‌ జాబ్‌లెస్‌ అయింది.. ఎడాపెడా పన్నుల బాదుడు
  • ప్రజా పోరాటాలతోనే బుద్ధి చెప్పాలి.. చంద్రబాబు పిలుపు 


ప్రజావేదిక ప్రజల డబ్బుతో కట్టింది. దేనికో ఒక దానికి ఉపయోగించు కోవచ్చు. కూల్చే అధికారం జగన్‌కు లేదు. కూల్చివేత ఆయన ఉన్మాదాన్ని బయటపెట్టింది. కూల్చేసి మూడేళ్లయినా కనీసం శిథిలాలను కూడా తొలగించలేని ప్రభుత్వమిది.

చంద్రబాబు


అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్ర విభజన వల్ల జరిగిన దానికంటే ఎక్కువ నష్టం జరిగిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్‌ వల్ల కూడా నష్టం ఉండదని.. కానీ జగన్‌రెడ్డి పాలనతో నష్టపోని వారు ఎవరూ ఉండరని చెప్పారు. ఆయన మంగళవారమిక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ పాలన మొదలై సంక్రాంతికి 32 నెలలవుతుందని, ఈ కాలంలో ఏం జరిగిందన్నది చూస్తే అంతా విధ్వంసమేనని, రాష్ట్రం 32 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వాపోయారు. పేదలకు ద్రోహం, అప్పుల కుప్పగా ఆంధ్ర, పరిశ్రమలు పరార్‌, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యల్లో రెండోస్థానం, పన్నులు-ధరల బాదుడు, ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు, దాడులు.. ఇవి తప్ప ఏమీ లేదని తెలిపారు.


‘ఏ పాలకుడైనా అధికారంలోకి రాగానే తామేం చేస్తామో చెబుతారు. కానీ ఈయన విధ్వంసం తో పాలన మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించారు. అమరావతి, పోలవరం, పరిశ్రమలు, రోడ్లు, పేదల కోసం కట్టిన ఇళ్లు, విద్య, వ్యవసాయం.. ఇలా అన్నింటినీ ధ్వం సం చేశారు. జగన్‌రెడ్డి పేదల ద్రోహి. పన్నుల బాదుడుతో పేదలపై మోయలేని భారాలు మోపాడు. అన్ని నిత్యావసరాల ధర లూ పెంచేశారు. పేదోడికి రూ.5కూ అన్నం పెట్టే అన్న క్యాంటీ న్లు రద్దు చేశారు. నవరత్నాలను మించి 10 రెట్ల సంక్షేమం చే శాం. అవన్నీ తీసేసిన పేదల ద్రోహి జగన్‌’ అని ధ్వజమెత్తారు. 


సంక్షేమం సాకు మాత్రమే..

స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి రూ.3.14 లక్షల కోట్ల అప్పు చేస్తే.. జగన్‌రెడ్డి కేవలం 32 నెలల్లో రూ.3.86 లక్షల కోట్ల అప్పు చేసేశారు. ఈ అప్పులన్నీ అవినీతి కోసం చేసినవే. సంక్షేమం అనేది సాకు మాత్రమే. ధైర్యముంటే తెచ్చిన అప్పుల్లో ఎంత సంక్షేమానికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. మా హయాంలో రూ.3 లక్షల కోట్ల అప్పుంటే.. ఇప్పుడు రూ.7 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎ్‌సడీపీ)లో అప్పుల శాతం అధికంగా ఉన్న రాష్ట్రం బిహార్‌ కాదు.. మనమే. జరిగిన విధ్వంసం నష్టం ఎంతన్నది ఒక సీనియర్‌ నాయకుడిగా చెప్పాల్సిన బాధ్యతతో చెబుతున్నా. వీటన్నింటికీ విరుగుడు పోరాటమే. ప్రజల సమస్యలపై తెలుగుదేశం పోరాడుతుంది. అది మాకోసం, మీకోసం కాదు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం.. మీ పిల్లల భవిష్యత్‌ కోసం.  


మాట మార్చడానికి సిగ్గు లేదూ!

శుభకార్యంతో ఎవరైనా పాలన మొదలుపెడతారు. కానీ జగన్‌రెడ్డి ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి.. ఇదే వేదికను రేపు కూల్చేస్తున్నామని చెప్పి ధ్వంసం చేశారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలిచ్చారు. జగన్‌ను ఒక్కటే అడుగుతున్నా.. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? ఇక్కడే ఇళ్లు కట్టుకున్నానన్నావా.. లేదా? ఇక్కడే రాజధానన్నావా.. లేదా? మరి మాటమార్చడానికి సిగ్గులేదూ? అమరావతి విధ్వంసంతో రూ.2 లక్షల కోట్ల సంపదను ధ్వంసం చేశావు. జగన్‌ చేసింది మోస మా.. కాదా? విధ్వంసమా.. కాదా? ప్రజలే చెప్పాలి. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు అని చెప్పేవాడిని. పోలవరం టెండర్లు టీడీపీ పిలవలేదు. అంతకుముందు కాంగ్రెస్‌ హయాంలో పిలిచారు. కేంద్రమే కాంట్రాక్టరును మార్చింది. జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ అంది. ఇప్పుడు చూస్తే అం చనా వ్యయం రూ.8 వేల కోట్లు పెంచేసే పరిస్థితి. అసలీ ప్రాజెక్టును పూర్తిచేయడం మీకు చేతనవుతుందా? ఈ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. టీడీపీ హయాంలో 5 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వమే శాసనసభలో చెప్పింది. ఒప్పందాలు చేసుకున్న రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులూ వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ పరిశ్రమలను తరిమేశారు. జాబ్‌కేలెండర్‌.. జాబ్‌లెస్‌ కేలెండర్‌ అయింది.


అన్నపూర్ణాంధ్రలో వరి వేయొద్దా?

దేశానికి అన్నంపెట్టిన అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌లో వరి వేయొద్దంటున్నారు. ఏ పంటకూ మద్దతు ధర లేకుండా చేశారు.  రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మూడో స్థానంలోకి తీసుకెళ్లిన ఘనత జగన్‌రెడ్డిది. నాడు-నేడుతో రూ.వేల కోట్లు ఖర్చుచేశారు. అవినీతిని కేంద్రీకృతం చేశారు. ఆంగ్ల మాధ్యమం అన్నారు. అమెరికా, ఇంగ్లండుల్లో అంతా ఆంగ్ల మాధ్యమమే. మరి అక్కడ ఉద్యోగాలన్నీ వాళ్లకే వస్తున్నాయా? మనవాళ్లకు వస్తున్నాయి కదా! భాష ఒక కమ్యూనికేషన్‌ సాధనమే. 3, 4, 5 తరగతులను విలీనం పేరుతో పైతరగతుల్లో కలిపారు. వచ్చిన పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టాలో టీచర్లకే తెలియడం లేదు. విదేశీ విద్య పథకం తీసేశారు. ఈయన పిల్లలు విదేశాల్లో చదువుకోవచ్చు. ఇక్కడ మాత్రం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు కూడా మూడు కిలోమీటర్లు వెళ్లాలి. అవకాశం ఇస్తే స్వాతంత్ర్యానంతరం కట్టిన వాటిపైనా పన్నులు వేస్తానంటాడు.


నాడు హైటెక్‌ సిటీతో మొదలుపెట్టి సైబరాబాద్‌ నగరాన్నే నిర్మించాం. ఆ రోజు కూడా గ్రాఫిక్స్‌ అని ఉంటే ఈ రోజు ఆ అభివృద్ధి సాధ్యమయ్యేదా? నా తర్వాత వచ్చిన రాజశేఖర్‌రెడ్డి విధ్వంసం చేసి ఉంటే ఈ రోజు హైదరాబాద్‌ ఇంత అభివృద్ధి అయ్యేదా? 


పోలవరం ప్రాజెక్టును మేం 71 శాతం పూర్తిచేశాం. వీళ్లు వచ్చి 2020 డిసెంబరులో పూర్తిచేస్తామన్నారు. ఆ తర్వాత 2021 అన్నారు. ఇప్పుడు 2022 అంటున్నారు. - చంద్రబాబు


ఒక్క రోజులో 124 కోట్లు తాగించారు

మద్యం క్వార్టర్‌ రూ.60 ఉన్నదానిని రూ.180 చేశారు. మద్యనిషేధమని చెప్పి ఒక్క రోజులో రూ.124 కోట్ల మద్యం తాగించారు. సొంత బ్రాండ్లు పెట్టి దోచేశారు. తయారీ, పంపిణీ, షాపులు అన్నీ జగన్‌వే. షాపుల్లో డిజిటల్‌ చెల్లింపులు లేకుండా చేశారు. అవి ఉంటే లెక్కలు బయటపడతాయని భయం. 

 

తప్పుడు ప్రచారంలో మాస్టర్‌ డిగ్రీ

అసత్యాలు, తప్పుడు ప్రచారాలు నమ్మబలికేలా చేయడంలో జగన్‌రెడ్డిది మాస్టర్‌ డిగ్రీ. అతనో పచ్చి అబద్ధాలకోరు. వివేకా హత్యపై ఏమన్నాడు? గుండెపోటు అన్నారు. సీబీఐ విచారణ వేయాలన్నారు. కానీ ఇప్పు డు..  మెదడు బయటకు వచ్చేలా నరికినవాళ్లకు మద్దతుగా మాట్లాడుతున్నారు. సీపీఎస్‌ రద్దా.. ఓ అదెంత! వారం రోజుల్లో చేసేస్తానన్నారు. ఇప్పుడేమో అప్పుడు లెక్కలు కట్టలేదు.. ఇప్పుడు కట్టామని సాక్షి గుమాస్తాతో చెప్పించారు. కనీసం జీవోలను కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు. జీవోలు ప్రజలకు తెలియనివ్వడం లేదంటే అవినీతి ఉన్నట్లేగా! జగన్‌ నిన్న ఢిల్లీ వెళ్లారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌.. కేం ద్రం మెడలు వంచి తెస్తామన్నారు. ఇప్పుడు ఏం చె బుతున్నారు? సొంత కేసులు, బాబాయి హత్య కేసు ల నుంచి తన వాళ్లను తప్పించడమే ఢిల్లీ ఎజెండా.


ఈ డీజీపీ ఐపీఎ్‌సకు అర్హుడు కాదు

ప్రజలు పోరాడితే వారిపై కేసులు.. ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం చేసినవారిపై కాకుండా నిరసన తెలిపిన వారిపై కేసులు.. ఎవరికివారు తమకు తామే కాపాడుకోవాలనే పరిస్థితికి వస్తున్నారంటే ఈ డీజీపీకి సన్మానం చేయాలి. ఇతను ఐపీఎ్‌సకు అర్హుడు కాదు. 

Updated Date - 2022-01-05T08:39:34+05:30 IST