
పశ్చిమ గోదావరి: సీఎం జగన్రెడ్డి ఓ ఫేక్ సీఎం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో మద్యనిషేధమంటూ జగన్ సొంత బ్రాండ్లు తెచ్చారని ఆయన ఆరోపించారు. నాటుసారా అంశాన్ని పక్కదోవపట్టించడానికే పెగాసెస్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పెగాసెస్ కొనలేదని అప్పటి డీజీపీ చెప్పినా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో జే బ్రాండ్లు పోవాలంటే జగన్ దిగిపోవాలని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి