Vice President of India : ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-08-11T18:25:38+05:30 IST

భారత దేశ 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ గురువారం

Vice President of India : ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : భారత దేశ 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ (Jagdeep Dhankar) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) తదితరులు హాజరయ్యారు. 


రాజస్థాన్ (Rajastan) నుంచి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనవారిలో జగదీప్ ధన్‌కర్ రెండోవారు. 2002 నుంచి 2007 వరకు ఆ రాష్ట్రానికి చెందిన భైరాన్ సింగ్ షెకావత్ (Bhairon Singh Shekhawat) ఈ పదవిని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన ధన్‌కర్‌ ఎన్డీయే అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ చేశారు. చెల్లుబాటైన 710 ఓట్లలో 528 ఓట్లు ధన్‌కర్‌కు లభించాయి. మార్గరెట్ అల్వా (Margaret Alwa)కు 182 ఓట్లు లభించాయి. జగదీప్ ధన్‌కర్ అంతకుముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. 


తెలుగు తేజం ఎం వెంకయ్య నాయుడు (M Venkayya Naidu) ఉప రాష్ట్రపతి పదవీ కాలం బుధవారంతో ముగిసింది.


ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈసారి లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్మన్ పదవులను నిర్వహిస్తున్న ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారే కావడం విశేషం. 


Updated Date - 2022-08-11T18:25:38+05:30 IST