జగ్గంపేటలో కోవ్యాగ్జిన్‌ కోసం ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2021-05-09T05:47:13+05:30 IST

జగ్గంపేట, మే 8: జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కోవ్యాగ్జిన్‌ టీకా రెండోడోసు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మార్చి 15 నుంచి 26వ వరకు కోవ్యాగ్జిన్‌ టీకాను మొదటి డోసు వేశారు. వీరందరికీ 28 రోజులు తరువాత రెండోడోసు వేయాల్సి ఉంది. ఇప్పటికే 50 రోజులు

జగ్గంపేటలో కోవ్యాగ్జిన్‌ కోసం ఎదురుచూపులు!

జగ్గంపేట, మే 8: జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో కోవ్యాగ్జిన్‌ టీకా రెండోడోసు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మార్చి 15 నుంచి 26వ వరకు కోవ్యాగ్జిన్‌ టీకాను మొదటి డోసు వేశారు. వీరందరికీ 28 రోజులు తరువాత రెండోడోసు వేయాల్సి ఉంది. ఇప్పటికే 50 రోజులు గడవగా టీకా వేయకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం టీకా వచ్చిందని వైద్యాధికారులు, ఎంపీడీవో కార్యాలయం నుంచి మొదటి డోసు వేయించుకున్నవారికి ఫోన్ల ద్వారా విజయం తెలియజేశారు. అధికారులు ఇలా ప్రకటించినప్పటికీ టోకెన్ల పంపిణీ పూర్తికాలేదని పలువురు చెప్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మండల పరిషత్‌ కార్యాలయానికి అందజేయడంతో వైసీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి మాత్రమే స్లిప్‌లు అందజేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగ్గంపేటలో శనివారం వైసీపీ నాయకులు తమకు కావాల్సిన వారి పేర్లు, టోకెన్లు తీసుకున్నారని మిగిలిన వారి పేర్లలిస్టును పక్కన పెట్టేశారని పలువురు ఆరోపించారు. ఇప్పటికే వ్యాక్సిన్‌ రెండోడోసు టీకా ఆలస్యం కావడంతో తమ ప్రాణాలకు ఏ విధమైన ముప్పు వాటిల్లుతోందనే ప్రజలు భయందోళనలు చెందుతున్నారు.

Updated Date - 2021-05-09T05:47:13+05:30 IST