నీళ్ల కుండను తాకాడని మా నాన్నను కూడా కొట్టారు

ABN , First Publish Date - 2022-08-18T17:07:44+05:30 IST

రాజస్థాన్‌లో దళిత బాలుడు ఇంద్ర మేఘ్‌వాల్‌(Indra Meghwal) మృతి పట్ల లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు (Former Lok Sabha Speaker Meera Kumar). వందేళ్ల క్రితం తన తండ్రి, దివంగత నేత జగ్జీవన్‌రామ్‌కు కూడా

నీళ్ల కుండను తాకాడని మా నాన్నను కూడా కొట్టారు

రాజస్థాన్‌లో దళిత బాలుడి మృతిపై జగ్జీవన్‌రామ్‌ కూతురు మీరా కుమార్‌ భావోద్వేగం


న్యూఢిల్లీ, ఆగస్టు 17: రాజస్థాన్‌లో దళిత బాలుడు ఇంద్ర మేఘ్‌వాల్‌(Indra Meghwal) మృతి పట్ల లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు (Former Lok Sabha Speaker Meera Kumar). వందేళ్ల క్రితం తన తండ్రి, దివంగత నేత జగ్జీవన్‌రామ్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేసుకొన్నారు. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారని బుధవారం ట్వీట్‌ చేశారు. ‘బడిలో అగ్రకులాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కుండలో నీళ్లు తాగుతుండగా మా నాన్నను అడ్డుకొన్నారు. ఆయన్ను బాగా కొట్టారు. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అదే కారణంతో రాజస్థాన్‌లో దళిత బాలుడిని కొట్టిచంపారు. కుల వ్యవస్థ దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తోంది. దేశానికి ప్రధాన శత్రువుగా ఉంది’ అన్నారు. తాను కూడా కుల వివక్షను ఎదుర్కొన్నట్లు అంతకుముందు ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కుల వ్యవస్థను అంతం చేయకపోతే అది ఎంతో మంది పిల్లలను బలి తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలో జూలై 20న 9 ఏళ్ల దళిత విద్యార్థి బడిలో నీటి కుండను తాకాడన్న కారణంతో టీచర్‌ చితకబాదాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇంద్ర మేఘ్‌వాల్‌ ఈ నెల 13న ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - 2022-08-18T17:07:44+05:30 IST