మద్యం తాగి వాహనాలు నడిపితే జైలే: ఎస్పీ

ABN , First Publish Date - 2021-01-24T06:27:22+05:30 IST

మద్యం తాగి వాహనాలు నడితే జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ చందనాదీప్తి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలే: ఎస్పీ

మెదక్‌ అర్బన్‌, జనవరి 23: మద్యం తాగి వాహనాలు నడితే జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ చందనాదీప్తి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 32వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  అతివేగంతో వాహనాలు నడిపి కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని హితవు చెప్పారు. గత 2020 సంవత్సరంలో 489 ఓవర్‌ లోడ్‌ కేసులు, 496 పరిమితికి మించి, 24 మైనర్‌ డ్రైవింగ్‌, 6,812 ట్రిపుల్‌ రైడింగ్‌, 1,427 రాంగ్‌ రూట్‌, 4,133 విత్‌ఔట్‌ సీట్‌ బెల్టు, 29,392 ఓవర్‌ స్పీడ్‌, 1,117 సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, 489 డ్రంకెన్‌ డ్రైవ్‌, 57,967 విత్‌ఔట్‌ హెల్మెట్‌ కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.

Updated Date - 2021-01-24T06:27:22+05:30 IST