భార్య మృతి కేసులో భర్తకు జైలు

ABN , First Publish Date - 2021-12-01T05:23:34+05:30 IST

భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఆమె మృతి కి కారణమైన భర్తకు జైలు శిక్ష విధిస్తూ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి టి.వాసు దేవన్‌ మంగళవారం తీర్పును వెలువరించారు.

భార్య మృతి కేసులో భర్తకు జైలు

బొబ్బిలిరూరల్‌: భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఆమె మృతి కి కారణమైన భర్తకు జైలు శిక్ష విధిస్తూ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి టి.వాసు దేవన్‌ మంగళవారం తీర్పును వెలువరించారు. కోర్టు సమన్వయ అధికారి మండ ల నారాయణరావు అందించిన సమాచారం ఇలా ఉంది. సాలూరు పట్టణం బంగారమ్మ కాలనీకి చెందిన జలుమూరు చిట్టిరాజు తన భార్య విజయను తరచూ వేధించి, హింసించడతో ఆమె బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుం ది. దీనిపై 2018 మార్చిలో సాలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చిట్టిరాజును అరెస్టు చేసి కోర్టుకు అప్పగించడంతో కేసు పూర్వాపరాలు విచారించిన మీదట నిందితునికి నాలుగేళ్లు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ మజ్జి జగన్నాథరావు కేసును వాదించినట్లు నారాయణరావు తెలిపారు.

 


Updated Date - 2021-12-01T05:23:34+05:30 IST