బాధితుడు గాయత్రీ జపం చేస్తుండగా, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసిన డాక్టర్!

ABN , First Publish Date - 2021-08-11T14:59:09+05:30 IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో...

బాధితుడు గాయత్రీ జపం చేస్తుండగా, బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేసిన డాక్టర్!

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక బాధితునికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. బాధితుడు స్పృహలో ఉంటూనే ఈ ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగా  బాధితుడు గాయత్రీ మంత్ర జపం చేశాడు. ఈ సర్జరీ సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. ఈ ఆపరేషన్ కోసం హైఎండ్ మైక్రోస్కోప్ వినియోగించారు. ఇది బ్రెయిన్ ఏరియాను మరింత దగ్గరగా చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి ఆపరేషన్లను దేశంలోని ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే చేస్తారు. 


వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిడ్మల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుని మెదడులోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి పొరపాటు జరిగినా అతను మాట కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా వైద్యులు... బాధితుడిని స్పృహలో ఉంచుతూనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వైద్యులు...బాధితునితో తరచూ చేతివేళ్లను, పాదాలను కొద్దిగా కదిలిస్తూ ఉండాలని చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి న్యూరో సర్జన్ డాక్టర్ కేకే బన్సాల్ మాట్లాడుతూ సాధారణంగా సర్జరీలు చేసేటప్పుడు బాధితునికి మత్తుముందు ఇస్తారు. అయితే ఈ కేసులో బాధితుని స్పృహలో ఉంచే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. బాధితుడు ఆపరేషన్ చేస్తున్నందసేపూ గాయత్రీ మంత్ర జపం చేస్తున్నారని తెలిపారు. కాగా డాక్టర్ బస్సాల్ 2018లోనూ ఇదేవిధంగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు.

Updated Date - 2021-08-11T14:59:09+05:30 IST