Polavaram: పోలవరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది: జైరాం రమేష్

ABN , First Publish Date - 2022-09-03T01:49:50+05:30 IST

పోలవరానికి సుదీర్ఘ చరిత్ర ఉందని కేంద్ర మాజీమంత్రి జైరాం రమేష్ (Jairam Ramesh) తెలిపారు. ఏపీ చరిత్రలో పోలవరం

Polavaram: పోలవరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది: జైరాం రమేష్

హైదరాబాద్: పోలవరానికి సుదీర్ఘ చరిత్ర ఉందని కేంద్ర మాజీమంత్రి జైరాం రమేష్ (Jairam Ramesh) తెలిపారు. ఏపీ చరిత్రలో పోలవరం (Polavaram) ప్రాజెక్టు మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. హోటల్ దస్పల్లాలో కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు (KVP Ramachandra Rao) రూపొందించిన.. 'జలయజ్ఞం-పోలవరం-ఒక సాహసి ప్రయాణం' పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సభలో జూమ్ ద్వారా  జైరాం రమేష్ ప్రసంగించారు. ఏపీ విభజన చట్టం ద్వారా జాతీయహోదా కల్పించాలని కోరామని, తాగు, సాగునీటికి పోలవరం ఎంతగానో ఉపయోగపడుతుందని జైరాం రమేష్ తెలిపారు. పోలవరంపై జవాబు చెప్పే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Vundavalli Aruna Kumar) తప్పుబట్టారు. పోలవరానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, విభజన హామీలో ఉందని గుర్తుచేశారు. బీజేపీకి ఇష్టం లేనట్లయితే పార్లమెంట్లో కొత్త యాక్ట్ తేవాలని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-03T01:49:50+05:30 IST