Awantiporaలో నలుగురు జైషే మహ్మద్ సహచరుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-07T16:43:49+05:30 IST

జమ్మూకశ్మీరులోని అవంతిపొరాలో నలుగురు జైషే మహ్మద్ సహచరులను పోలీసులు అరెస్టు చేశారు....

Awantiporaలో నలుగురు జైషే మహ్మద్ సహచరుల అరెస్ట్

అవంతిపొరా(జమ్మూ అండ్ కశ్మీర్): జమ్మూకశ్మీరులోని అవంతిపొరాలో నలుగురు జైషే మహ్మద్ సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.జమ్మూ కాశ్మీర్ పోలీసులు అవంతిపోరా జిల్లాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాద కార్యకలాపాల గుట్టును ఛేదించారు. పోలీసులు జరిపిన ఆపరేషన్‌లో నలుగురు జైషే మహ్మద్ సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాద సహచరులు ఉమర్ ఫరూఖ్ దార్, సోరాజ్ మంజూర్ మాలిక్, ఇర్షాద్ అహ్మద్ లోన్, షహబాద్‌కు చెందిన అఫ్నాన్ జావీద్ ఖాన్‌లుగా గుర్తించారు.అరెస్టు అయిన వారు జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు రవాణ సదుపాయాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తున్నారని జమ్మూకశ్మీర్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.


Updated Date - 2022-03-07T16:43:49+05:30 IST