ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌

ABN , First Publish Date - 2020-11-27T05:59:58+05:30 IST

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 2024 లోగా ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జేసీ సీహెచ్‌ కీర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌

కాకినాడ,నవంబరు26(ఆంధ్రజ్యోతి): జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 2024 లోగా ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జేసీ సీహెచ్‌ కీర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి జూమ్‌ యాప్‌లో వీసీ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, జల్‌జీవన్‌ మిషన్‌, మనం-మన పరిశుభ్రత, కంటి వెలుగు, బియ్యం కార్డుల మ్యాపింగ్‌, సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై ఆమె సమీక్షించారు. గడువులోగా ప్రజలందరికీ సేవలు అందేలా చూడాలన్నారు.  వీసీలో జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీపీవో ఆర్‌.విక్టర్‌, డీఎల్‌పీవోలు, డీడీవోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:59:58+05:30 IST