జాలువారుతున్న జలపాతం
సీతారామపురం, నవంబరు 29: నివర్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రముఖ పర్యాటక శైవక్షేత్రమైన భైరవకోన జలపాతం ఉధృతంగా వస్తూ కనువిందు చేస్తోంది. వాగులు, వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు ఆలయానికి వచ్చే భక్తులు, ఇటు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు భైరవకోనకు పోటెత్తుతున్నారు.
కనులవిందుగా భైరవకోన జలపాతం