పాము కాటుకు జల్లికట్టు ఎద్దు మృతి

ABN , First Publish Date - 2021-02-28T12:03:17+05:30 IST

పాము కాటుకు జల్లికట్టు ఎద్దు మృతి చెందింది. పుదుకోట జిల్లా నెమిలికి చెందిన అనురాధ ఎస్‌ఐగా పనిచేస్తోంది. ఆమె సోదరుడు మారిముత్తు రావణన్‌ పేరిట జల్లికట్టు...

పాము కాటుకు జల్లికట్టు ఎద్దు మృతి

చెన్నై/ఐసిఎఫ్ (ఆంధ్రజ్యోతి): పాము కాటుకు జల్లికట్టు ఎద్దు మృతి చెందింది. పుదుకోట జిల్లా నెమిలికి చెందిన అనురాధ ఎస్‌ఐగా పనిచేస్తోంది. ఆమె సోదరుడు మారిముత్తు రావణన్‌ పేరిట జల్లికట్టు ఎద్దును సంరక్షిస్తున్నాడు. ఈనెల 14వ తేదీ పుదుకోట జిల్లా చోళగన్‌పట్టిలో జరిగిన జల్లికట్టు పోటీలో పాల్గొన్న ఎద్దు హఠాత్తుగా కనిపించకుండాపోయింది. తచ్చన్‌కురిచ్చి సమీపంలో ఎద్దు ఉన్నట్టు అందిన సమాచారంతో మారిముత్తు అక్కడకు వెళ్లి పరిశీలించగా, ఎద్దు మృతిచెంది పడివుంది. ఎద్దు కళేబరానికి వెటర్నీరీ వైద్యుల నిర్వహించిన పోస్టుమార్టంలో, పాము కాటుకు ఎద్దు మృతిచెందినట్టు తెలిసింది. దీంతో, ఎద్దును గ్రామానికి తీసుకొని అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-02-28T12:03:17+05:30 IST