జామకాయలు అధరహో..

ABN , First Publish Date - 2022-08-08T06:05:15+05:30 IST

పేదోడి యాపిల్‌ ఽధర పెంచేశారు. గతంలో రూపాయికి ఒక జామ కాయ ఇచ్చేవారు.అప్పటిలో సాగు కూడా తక్కు వగా ఉండేది. అయితే ప్రస్తుతం సాగు పెరి గింది.. దిగుబడి పెరిగింది..

జామకాయలు అధరహో..
జామకాయలు


రైతు వద్ద 100 కాయలు రూ.300


కడియం, ఆగస్టు 7 : పేదోడి యాపిల్‌ ఽధర పెంచేశారు. గతంలో రూపాయికి ఒక జామ కాయ ఇచ్చేవారు.అప్పటిలో సాగు కూడా తక్కు వగా ఉండేది. అయితే ప్రస్తుతం సాగు పెరి గింది.. దిగుబడి పెరిగింది.. ఽధర కూడా పెంచే శారు. ప్రతి ఒక్కరూ జామ కాయ తినాలనేది వైద్యుల సూచన. దీంతో ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చిపడింది.ప్రస్తుతం రైతు వద్ద 100 కాయలు రూ. 250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తు న్నారు.అంటే రైతు వద్ద ఒక్క జామ కాయ రూ.3లు పడుతోంది. వ్యాపారులు మార్కెట్‌లో కాయ సైజును బట్టి ఒక్కటి రూ. 5 నుంచి రూ. 10ల వరకు విక్రయిస్తున్నారు. కిలోల రూ. 60 నుంచి వంద రూపాయలకు విక్రయిస్తు న్నారు.పెద్ద కాయలు అయితే 5 మాత్రమే వస్తాయి.అంటే ఒక్కోకాయ రూ.20 అన మాట. పేదవాడికి అందుబాటులో ఉండే జామ యాపిల్‌ రేటుతో సమానంగా ఉండ డంతో జా మను కొనుక్కుందామనుకునే వారు ధర చూసి అయ్య బాబోయ్‌ అంటూ నోరెళ్ళబెడుతున్నారు.


ఏడాది నుంచి దిగుబడి.. 


జామ పంట (చెట్టు) నాటిన నుంచి ఏడాది కాలానికి ఫలసాయానికి వస్తుంది. దిగుబడి ప్రారంభమైన జామ పంట వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా, మామిడి ఫలాలు వచ్చే సమయం (వేసవికాలం)లో తక్కువగా దిగుబడి ఉంటుంది. మూడు నుంచి నాలుగేళ్ల పాటు పండించే జామ పంట వేసిన ఏడాది తరువాత ఎకరాకు రోజుకు 500 నుంచి చెట్టు ఎదిగే కొద్దీ ఒక్కోసారి వెయ్యు కాయల వరకు దిగుబడి వస్తుంది. మిగతా సమయాల్లో జామ ధర మెండుగా ఉన్నప్పటికీ, మామిడి ఫలాల సీజన్‌లో మా త్రం ధర అంతంత మాత్రంగానే ఉంటుంది. జామ సాగు చేసేందుకు భూమి శిస్తు, మొ క్కలు వేయడానికి, ఎరువులు,పురుగుమందులు ఇలా ఎకరా ఒక్కంటికి రూ.లక్ష పైమాటే ఖర్చు అవుతుంది.ఎకరాకు సుమారు రూ.2 లక్షల వర కూ ఆదాయం వస్తుంది. దీంతో రైతులు ఎక్కు వగా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


పొట్టిలంక నుంచి ఎగుమతి..


కడియం మండలంలో ప్రధానంగా పొట్టిలంక, దామిరెడ్డిపల్లి, వీరవరం,        బుర్రిలంక, మాధవరాయుడుపాలెం,జేగురుపాడు గ్రామాల్లో ఉద్యానశాఖ గణాంకాల ప్రకారం 20 హెక్టార్లలో రైతులు జామ సాగు చేస్తున్నారు. అను నిత్యం పొట్టిలంక మార్కెట్‌గా ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ వంటి సుదూర ప్రాంతాలతో పాటు నరసాపురం, అమలాపురం, పాలకొల్లు, మార్టేరు, రాజోలు తదితర ప్రాంతాలకు ఎగు మతి అవుతుంటాయి. 


తింటే ఆరోగ్యమని..


ప్రస్తుతం చాలా మందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. న్యూట్రిషనిస్టుల సూచనల మేరకు పండ్లు తీసుకుంటున్నారు. దీనిలో జామకాయ లది ప్రత్యేక స్థానం. ఈ నేపథ్యంలో డిమాండ్‌ పెరిగింది.ప్రతి రోజూ జామకాయలు తినే వారి సంఖ్య పెరిగింది. దీంతో పేదోడి యాపిల్‌ కాస్తా ఽధర పెరడగంతో పేదోడికి అందకుండా పోతోంది. 


Updated Date - 2022-08-08T06:05:15+05:30 IST