జమాతే ఈ-ఇస్లామీ హింద్‌ సేవలు హర్షణీయం

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

జమాతే ఈ-ఇస్లామీ హింద్‌ సేవలు హర్షణీయం

జమాతే ఈ-ఇస్లామీ హింద్‌ సేవలు హర్షణీయం
వికారాబాద్‌ : మాట్లాడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త తస్వర్‌ అలీ

వికారాబాద్‌/కొడంగల్‌, మే 15 : జమాతే ఈ-ఇస్లామీ హింద్‌ సేవలు హర్షించదగ్గ విషయమని ప్రముఖ వ్యాపార వేత్త తస్వర్‌ అలీ అన్నారు. ఆదివారం జమాతే ఈ-ఇస్లామీ హింద్‌-వికారాబాద్‌ ఆధ్వర్యంలో ఆల్‌ ఖేర్‌ సొసైటీ ఉచిత ఖత్నా క్యాంపు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైతే తోటి మానవులను కరుణిస్తాడో.. వారిని అల్లా కరుణిస్తాడని అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యం అయినా గొప్పదేనని అన్నారు. జమాతే ఈ-ఇస్లామీ హింద్‌ సేవలు ఎప్పటిలాగానే కొనసాగించాలని.. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎండీ హఫీజ్‌, జమాతే ఈ-ఇస్లామీ హింద్‌ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్‌ ఫయాజోద్దిన్‌, మునిసిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు అఫ్జల్‌ షకీల్‌, పూడూరు మండలం మన్నెగూడ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఆదిల్‌, ఆల్‌ ఖేర్‌ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌, యువ నాయకులు సిద్దిఖ్‌, జాకీర్‌, రఫీయుద్దీన్‌, అబ్దుల్‌ వాసే, హబీబ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముస్లిం యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా క్యాంపును నిర్వహించారు. ఆదివారం కొడంగల్‌లోని మక్కా మస్జీద్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో మండలంలోని 66మంది చిన్నారులకు ఖత్నా నిర్వహించినట్లు మైనారిటీ నాయకులు ఎస్‌ఎం. గౌసన్‌ తెలిపారు. క్యాంపును ఎంపీపీ ముద్దప్పదేశ్‌ముఖ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీని ముస్లిం నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, ముస్లిం మత పెద్దలు అబ్దుల్‌ రషీద్‌, ఎండీ.కరీం, ఆసిఫ్‌ఖాన్‌, కొడంగల్‌ నయీం, షాకీర్‌, ఫెరోజ్‌ఖాన్‌, రహీం, సయ్యద్‌మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST