జంబూ సవారీకి రిహార్సల్స్‌

ABN , First Publish Date - 2021-10-12T18:53:14+05:30 IST

ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలలో కీలకమైన జంబూ సవారీ కోసం మైసూరు ప్యాలె్‌సలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈనెల 15న విజయదశమి రోజున జంబూ సవారీ జరగనుంది. అంబారీని

జంబూ సవారీకి రిహార్సల్స్‌

బెంగళూరు: ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలలో కీలకమైన జంబూ సవారీ కోసం మైసూరు ప్యాలె్‌సలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈనెల 15న విజయదశమి రోజున జంబూ సవారీ జరగనుంది. అంబారీని మోసే గజరాజు అభిమన్యుకు సోమవారం కొయ్య అంబారీని అమర్చి ఊరేగించారు. ప్యాలెస్‌ ప్రాంగణంలో అభిమన్యుసహా ఇతర గజరాజులు వెంట నడిచాయి. 750 కిలోల ఇసుక బస్తాలతో కొయ్య అంబారీని సునాయాసంగా అభిమన్యు మోసింది. సీఏఆర్‌ విభాగం డీసీపీ శివరాం నేతృత్వంలో పుష్పార్చన రిహార్సల్స్‌ నిర్వహించారు. అభిమన్యుతోపాటు కావేరి, చైత్ర, అశ్వత్థామ, లక్ష్మి వెంట నడిచాయి. దసరా కోసం అడవి నుంచి వచ్చిన ధనంజయ, గోపాలస్వామి అనే ఏనుగులు ప్యాలెస్‌ పూజల్లో పాల్గొన్నాయి. పోలీసు బ్యాండ్‌ సాగింది. మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురవడంతో రిహార్సల్స్‌కు అంతరాయం ఏర్పడింది. 

Updated Date - 2021-10-12T18:53:14+05:30 IST