కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2022-03-22T23:36:29+05:30 IST

సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ కరణ్ సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్

కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ కరణ్ సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ మంగళవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూ-కశ్మీరుకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో అభిప్రాయ భేదాల కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో విక్రమాదిత్య తెలిపారు. 


జమ్మూ-కశ్మీరులోని క్షేత్ర స్థాయి వాస్తవాలకు కాంగ్రెస్ దూరమైందని విక్రమాదిత్య ఆరోపించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంత ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను తెలుసుకోవడంలో పార్టీ విఫలమైందన్నారు. జాతీయ ప్రయోజనాలను ప్రతిబింబించే ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై తన వైఖరికి, కాంగ్రెస్ వైఖరికి పొంతన కుదరడంలేదన్నారు. 


విక్రమాదిత్య సింగ్ జమ్మూ-కశ్మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం శాసన సభ ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. 


Updated Date - 2022-03-22T23:36:29+05:30 IST