9 నెలల బిడ్డపై కన్నతల్లి కర్కశత్వం

ABN , First Publish Date - 2022-04-12T20:23:01+05:30 IST

జమ్ము: కేవలం 9 నెలల పసికందును బలంగా నెట్టివేయడం, చెంపదెబ్బ కొట్టడం, బెడ్ పై విసిరేయడం.. ఇదీ ఓ కన్నతల్లి అనాగరిక ప్రవర్తనకి సంబంధించిన ఉదంతం.

9 నెలల బిడ్డపై కన్నతల్లి కర్కశత్వం

జమ్ము: కేవలం 9 నెలల పసికందును బలంగా నెట్టివేయడం, చెంపదెబ్బ కొట్టడం, బెడ్ పై విసిరేయడం.. ఇదీ ఓ కన్నతల్లి అనాగరిక ప్రవర్తన. శిశువు వేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్న ఈ ఘటన జమ్ముకాశ్మీర్ లో వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ గా మారడంతో ఈ ఘటన బయటపడింది. సాంబ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పసికందు పట్ల కర్కశంగా వ్యవహరించిన నిందితురాలిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. హృదయాన్ని మెలిపెడుతున్న ఈ వీడియోని బంధువులు చిత్రీకరించినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సాంబా ఎస్ఎస్ పీ అభిషేక్ మహాజన్ స్పందించారు. బిడ్డను తండ్రికి అప్పగించామని తెలిపారు. వీడియో చూసిన బాలుడి తండ్రి, గ్రామపెద్ద పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితురాలిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటన నెలక్రితం జరిజరిగిందని, అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిందని వివరాలను తెలిపారు.

Updated Date - 2022-04-12T20:23:01+05:30 IST