‘గడప గడప’లో గోడు

ABN , First Publish Date - 2022-05-19T06:40:47+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం జగన్‌ ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ముషిడిపల్లిలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్య క్రమాన్ని నిర్వహించారు.

‘గడప గడప’లో గోడు
ముషిడిపల్లిలో మహిళలు చెప్పిన సమస్యలు రాసుకుంటున్న మంత్రి బూడి

 

 ముషిడిపల్లిలో మంత్రి బూడి.., మల్లవరం, ఒమ్మవరం పంచాయతీల్లో  నర్సీపట్నం, చోడవరం ఎమ్మెల్యేలు గణేశ్‌, ధర్మశ్రీ పర్యటన

  సమస్యలు విన్నవించిన పలువురు గ్రామస్థులు.. పరిష్కారానికి హామీ

దేవరాపల్లి, మే 18 : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే సీఎం జగన్‌ ముఖ్య ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.  మండలంలోని ముషిడిపల్లిలో  బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్య క్రమాన్ని నిర్వహించారు. కొటానవారి కాలనీ నుంచి ప్రారంభించి కొటాన నాగేష్‌ కిడ్నీ బాధితుడ్ని పరామర్శిం చారు.  కాలనీలో కల్యాణ మండపం నిర్మించాలని కోరడంతో తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  రాయవరపు కాలనీలో రక్షిత నీటి పథకం ట్యాంకర్‌ పోయిందని అక్కడి వారు వివరించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.  అంబేడ్కర్‌ కాలనీలో పథ కాలు అందుతున్నదీ లేనిది అక్కడి వారిని తెలుసుకుని,  ఇప్పటి వరకు పొందిన పథకాలపై పుస్తకాలను అంద జేశారు. ఇన్‌చార్జి డీపీవో ఆర్‌.శిరీషా రాణి, ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరీ, జడ్పీ టీసీ కర్రి సత్యం, తహసీల్దార్‌ రమేష్‌ బాబు, ఎస్‌ఐ పి.సింహాచలం  సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు మతల దేముడమ్మ, బొడ్డులక్ష్మి, బి.గోవింద, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, బూరే బాబూరావు,   పోలినాయుడు, సుబ్బలక్ష్మి, సత్యనారాయణ తదితరుల పాల్గొన్నారు. 


 ఒమ్మవరంలో జగన్నినాదం

 సమస్యలు చెప్పుకునే అవకాశం కోల్పోయిన మహిళలు

రావికమతం : మూడేళ్ల తర్వాత తమ గడపకు వస్తున్న ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పుకుందామన్న మహి ళల ఆశలు జైజగన్‌ నినాదాల హోరులో కలిసిపోయాయి. మండలంలోని ఒమ్మవరం గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పర్యటించారు.మూడేళ్లలో  ప్రభుత్వం పథకాల రూపంలో ఇంటింటికీ అం దించిన ఆర్థిక సాయం వివరాలను పలువురికి ఎమ్మెల్యే వివరించారు. అయితే కొం దరు వ్యక్తిగత, సామాజిక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా, వైసీపీ శ్రేణులు జైజగన్‌ నినాదాలను అందుకున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునే అవకాశం వారికి లేకపో వడంతో వారంతా నిరాశకు గుర య్యారు. ఈ కార్యక్రమంలో పలు వురు నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


పది రోజులుగా తాగునీరు లేదు

ఎమ్మెల్యే వద్ద మల్లవరం ఎస్సీ కాలనీ మహిళలు

మాకవరపాలెం : ‘పది రోజులుగా గ్రామంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడు తున్నాం. పారిశుధ్య పనులు సరిగా జరగడం లేదు. వీటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరు..’ అంటూ మాకవరపాలెం మండలం మల్లవరం పంచా యతీ ఎస్సీ కాలనీ మహిళలు వాపోయారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మల్లవరం పంచాయతీలో పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌  బుధవారం ప్యటించారు. తొలుత గ్రామంలోని ఆంజ నేయ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎస్సీ కాలనీలోకి వెళ్లారు. అక్కడి మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టాను విప్పారు. తాగునీటితో పాటు పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉన్నా కన్నెత్తి చూసేవారు కరువయ్యారన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే  వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటా మని అధికారులకు హెచ్చరించారు.  ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, జడ్పీటీసీ పెట్ల సత్యవేణి, ఎంపీడీవో అరుణశ్రీ, మల్లవరం సర్పంచ్‌ మిడతాన శిరీషా, వైసీపీ మండల అధ్యక్షుడు రుత్తల వాసు, త్రినాథ్‌, మూకల బాలకృష్ణ, పెట్ల భద్రాచలం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:40:47+05:30 IST