జన జాతర

ABN , First Publish Date - 2021-03-06T04:32:45+05:30 IST

కోరిన కోర్కెలు తీర్చే నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలే పల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ జాతర కొన సాగుతోంది.

జన జాతర
సిడేకు హాజరైన భక్తులు

- ఘనంగా పోలేపల్లి ఎల్లమ్మ సిడే

- కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి తరలి వచ్చిన భక్తజనం

- అమ్మవారి మూల విరాట్‌ స్థాపనలో వాగ్వాదం


కోస్గి రూరల్‌, మార్చి 5 : కోరిన కోర్కెలు తీర్చే నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలే పల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ జాతర కొన సాగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడే కార్యక్రమం శుక్రవారం కన్నుల పండువగా సా గింది. సిడేకు ముందు జల్జి బిందెల కార్యక్రమా న్ని నిర్వహించారు. సమీప బావి నుంచి జల్ది బిందెలను తీసుకొచ్చి, అమ్మవారి గర్భ గుడిలో ప్రతిష్ఠించారు. అనంతరం సిడేకు ఊయల కట్టా రు. అందులో అమ్మావారి విగ్రహాన్ని ఉంచారు. ఆలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షణ చేస్తున్న సమయంలో భక్తులు పసుపు, గవ్వలతో కూడిన బండారు చల్లారు. శివసత్తులు పూనకాలతో ఊ గిపోయారు. జాతరకు కర్ణాటక, మహారాష్ణ్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి గ్రామంలోని పురాతన ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను దేవాలయానికి తీసుకొచ్చి పల్లకీ సేవ నిర్వహించారు. శనివారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం, ఆదివారం ప్రత్యేక పూజలతో ఈ జాతర ముగుస్తుంది.

కాగా, ఊరేగింపు ఆనంతరం అమ్మవారి మూల విరాట్‌ను యాధా స్థానంలో ప్ర తిష్ఠిస్తున్న సమయంలో పూజారులు, ఆలయ చైర్మన్‌ వెంకటేశ్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విగ్రహ స్థాపన మేం చేస్తామంటే, మేం చేస్తామంటూ విగ్రహాన్ని లాక్కునే ప్ర యత్నం చేయడంతో తోపులాట జరిగింది.





Updated Date - 2021-03-06T04:32:45+05:30 IST