Janagama: వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్

ABN , First Publish Date - 2022-08-07T19:37:10+05:30 IST

రఘునాథపల్లి మండలం, కోడూరులోని వరద నీటిలో ఓ ట్రాక్టర్ (Tractor) కొట్టుకుపోయింది.

Janagama: వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్

జనగామ (Janagama) జిల్లా: రఘునాథపల్లి మండలం, కోడూరులోని వరద నీటిలో ఓ ట్రాక్టర్ (Tractor) కొట్టుకుపోయింది. కల్వర్టు కింద స్తంభానికి చిక్కుకుని ట్రాక్టర్ ఆగింది. అందులో చిక్కుకున్న డ్రైవర్ చెరుకు నరసింహులు సహాయం కోసం కేకలు వేశాడు. సమీపంలో పొలం పనులు ముగించుకుని వస్తున్న ఓ రైతు (Farmer) ప్రమాదాన్ని గుర్తించాడు. చాకచక్యంగా చీరలను మూడివేసి తాడుగా మార్చి టాక్టర్ డ్రైవర్‌ను కాపాడాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వాగు వద్దకు చేరుకుని జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌ను ఒడ్డుకు చేర్చారు.

Updated Date - 2022-08-07T19:37:10+05:30 IST