జన గళమున జనగణమన

ABN , First Publish Date - 2022-08-17T04:43:18+05:30 IST

ఎప్పుడూ చూ డని అరుదైన దృశ్యం కళ్ళముందు ఆవిష్కృతమైంది.

జన గళమున జనగణమన
నారాయణపేటలోని బారంబావి ముందు సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న కలెక్టర్‌ హరిచందన, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు

- ఏకకాలంలో వేలాది మంది జాతీయ గీతాలాపన

- నిమిషం పాటు ఎక్కడికక్కడ ఆగిన జనజీవనం

నారాయణపేట టౌన్‌, ఆగస్టు 16 : ఎప్పుడూ చూ డని అరుదైన దృశ్యం కళ్ళముందు  ఆవిష్కృతమైంది. వేలాది గొంతుకలు ఏకకాలంలో జాతీయ గీతాన్ని ఆలపించి, దేశభక్తిని చాటుకున్నాయి. ప్రతీ ఒక్కరు జాతీయ జెండా చేతబూని, జైబోలో భారత్‌మాతాకీ జై అంటూ నినదించడంతో జాతీయ భావం ఉప్పొం గింది. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఎక్కడున్నవారు అక్కడే సామూహికంగా జాతీయ గీతాదీన్ని ఆలపించారు. దారిన వెళ్లే వారు సైతం తమ వాహనా లను పక్కన ఆపి, ఈ అరుదైన కార్యక్ర మంలో భాగస్వామ్యం అయ్యారు. చిన్న, పెద్దా, కులం, మతం తేడా లేకుండా పాలుపంచుకున్నారు. నారాయణపేట జి ల్లా కేంద్రంలో ఎక్కడి కక్కడ జనాలు ఆగిపోయి, జాతీయ గీతాన్ని పాడారు. జిల్లా కేంద్రంలోని బారంబావి ప్రాంగణం లో ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపనలో కలెక్టర్‌ హరిచందనతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు దాదాపు 5,500 మంది పాల్గొని 11.30 గంటలకు ఒకేసారి సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించా రు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీలు, మండలాలు, గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపన లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయ డం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. గీతాలాపనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలె క్టర్‌ పద్మజా రాణి, డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా అధి కారులు వేణుగోపాల్‌, వీరస్వామి, వీణావాణి, సురేఖ, కన్యాకుమారి, జ్యోతి, మురళి, ఆర్డీవో రాంచందర్‌, కమిషనర్‌ సునీత, పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, విద్యాసాగర్‌, సా యినాథ్‌, సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు, విద్యార్థులు,  తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-17T04:43:18+05:30 IST