జ‌న‌ని అయ్య‌ర్ పేరు మార్పు

Jun 2 2021 @ 15:28PM

తమిళ చిత్రపరిశ్రమకు చెందిన యంగ్‌ హీరోయిన్లలో జనని అయ్యర్‌ ఒకరు. ఈమె తాజాగా తన పేరును మార్చుకుంది. ‘అవన్‌ ఇవన్‌’, ‘పాగన్‌’, ‘తెగిడి’, ‘విదిమది’ తదితర చిత్రాల్లో నటించిన జనని అయ్యర్‌ ఇప్పుడు తనపేరును జననిగా కుదించుకుంది. దీనిపై ఆమె తన ట్విటర్‌ ఖాతాలో ‘ఛేంజ్‌ ఈజ్‌ ఇది ఓన్లీ కాన్‌స్టెంట్‌, ఆల్వేస్‌ యునైటెడ్‌’ అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ‘వేషం’, ‘కచడ కపర’, ‘బగీరా’, ‘యాక్కై తిరి’ అనే చిత్రాల్లో నటిస్తోంది. అయితే, జనని అయ్యర్‌ ఉన్నట్టుండి తన పేరును మార్చుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, కొందరు హీరోయిన్లు మాత్రం మరోలా కామెంట్స్‌ చేస్తున్నారు. పేరు మార్చుకుంటే సినీ అవకాశాలు రావని, మనలో టాలెంట్‌ వుండాలని వ్యాఖ్యానిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.