
అమరావతి: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన పార్టీ పేర్కొంది. సీఎంను చంపుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది. హింసను ప్రోత్సహించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని పేర్కొంది. పార్టీ సానుభూతిపరుడిని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసేవారిపట్ల జనసేన నేతలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని జనసేన స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి