ఆర్టీసీ చార్జీల పెంపు దుర్మార్గం

ABN , First Publish Date - 2022-07-06T07:05:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ దుయ్యబట్టారు. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళవారం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఆర్టీసీ చార్జీల పెంపు దుర్మార్గం

పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌

పెడన  : వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ దుయ్యబట్టారు. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళవారం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, డీజిల్‌ సెస్సు పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచేసిందన్నారు. రెండున్నర నెలలు తిరగకుండానే రెండోసారి ఆర్టీసీ చార్జీలను పెంచడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధి క ధరలు, చార్జీలు, పన్నుల పెంపుతో ప్రజలు సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  బంటుమిల్లి రోడ్డు సెంటర్‌ వరకు ప్రదర్శన చేశారు. అర్జా వెంకట నగేష్‌, అబ్దుల్‌ ఖయూమ్‌, శలపాటి ప్రసాద్‌, బెజవాడ నాగరాజు, పరసా సూర్యనారాయణ, వూటుకూరి మోహనరావు, శీరం ప్రసాద్‌, పోలగాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

జనసేన పార్టీ ఆందోళన

 అవనిగడ్డ టౌన్‌  : వైసీపీ ప్రభుత్వం సామన్యుడిపై మోయలేని భారం మోపిందని,  మూడో సారి పెరిగిన ఆర్టీసీ చార్జీలే ఉదాహరణ అని జనసేన, బీజేపీ నేతలు  ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ జనసేన, బీజేపీ నేతలు అవనిగడ్డ ఆర్టీసీ డిపో వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. జనసేన నేతలు వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ జగ న్‌ పోవాలి....పవన్‌ రావాలంటూ నినాదాలు చేశారు.  బస్సు ఛార్జీలు, విద్యుత్‌ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  జనసేన పార్టీ జిల్లా  అధికారి ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్‌, జిల్లా కార్యదర్శి గాజుల శంకరరావు, సీనియర్‌ నాయకులు బచ్చు వెంకటనాథ్‌, చన్నగిరి సత్యనారాయణ, కోడూరు, మోపిదేవి, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య, పూషడపు రత్నగోపాల్‌, గుడివాక శేషుబాబు,  ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్‌, అశ్వారావుపాలెం ఉపసర్పంచ్‌ యక్కటి నాగరాజు, బాదర్ల లోలాక్షుడు నాయుడు, రేమాల మురళీ, తోట మురళీకృష్ణ, భోగిరెడ్డి నాగేశ్వరరావు, బాలాజీ, తుంగల వేణు, కమ్మిలి సాయి, బొప్పన పృథ్వీ, మండలి శివప్రసాద్‌, గుగ్గిలం అనిల్‌, జనసైనికులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-06T07:05:03+05:30 IST