Pawan wishes to modi: ప్రధాన మంత్రిగా మోదీ మరిన్ని విజయాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-09-17T17:23:38+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Pawan wishes to modi: ప్రధాన మంత్రిగా మోదీ మరిన్ని విజయాలు సాధించాలి

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra modi)కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (Birthday wishes) తెలిపారు. దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా, గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అజేయ రాజకీయ విజయుడు అని కొనియాడారు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు... అసామాన్యమైన భారతదేశపు ప్రధాన మంత్రి (Prime minister)గా నిలిచారంటే ఆ రాజకీయ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో ఊహించవచ్చన్నారు. ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఆయన దార్శనికత, ప్రధాన మంత్రిగా క్లిష్టమైన, సున్నితమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలు మోదీని రాజకీయవేత్తగా అగ్రపథాన నిలిపాయని జనసేనాని అన్నారు.


పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కాశ్మీర్‌కు సంబంధించిన  370 అధికరణం, ట్రిపుల్ తలాక్ రద్దులు, పౌరసత్వం సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అమలు వంటివి సాహసోపేత నిర్ణయాలుగా చెప్పవచ్చన్నారు. భారతీయ  ఔన్నత్యం, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి కొనయాడతగినదని తెలిపారు. ప్రధాన మంత్రి(PM Modi)గా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామి దేశంగా వెలుగొందాలని కోరుకుంటున్నానన్నారు. మోదీ(PM narendra modi)కి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ (Janasena chief) తెలిపారు. 


Updated Date - 2022-09-17T17:23:38+05:30 IST