అప్పుడే అంబేద్కర్‌ కోనసీమ అంటే ఇబ్బంది వచ్చేది కాదు: Pawan

ABN , First Publish Date - 2022-05-25T19:52:06+05:30 IST

కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

అప్పుడే అంబేద్కర్‌ కోనసీమ అంటే ఇబ్బంది వచ్చేది కాదు: Pawan

అమరావతి: కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గత కొన్ని రోజుల కిందట జిల్లాల విభజనను రాష్ట్ర ప్రబుత్వం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని... కొనసీమకు ప్రత్యేక విధానం అవలంబించారని అన్నారు. అన్ని జిల్లాలకు నామకరణం చేసిన రోజే అంబేద్కర్ కోనసీమ అని ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన వ్యతిరేకించదని స్పష్టం చేశారు. వైస్సార్ పేరుతో కడప జిల్లా.. అంతకు ముందు పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరుకు పెట్టారని గుర్తుచేశారు. ఈ రోజు వైస్సార్ కడప కేవలం వైస్సార్ జిల్లాగా మార్చారన్నారు. ఏ ప్రభుత్వం అయిన పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని ఆలోచించాలని జనసేనాని సూచించారు.


కృష్ణ జిల్లా కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారని, కృష్ణా తీరం ఎక్కువగా వున్న చోట ఎన్టీఆర్ జిల్లా అన్నారని తెలిపారు. అక్కడే వంగవీటి డిమాండ్ వచ్చిందని అన్నారు. ఇలాంటి పేర్లు పెట్టేప్పుడు సున్నితంగా వ్యవహరించాలని హితవుపలికారు. కోనసీమ జిల్లాకు ఆ రోజు పేరు పెట్టకుండా ఇప్పుడు పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని కోనసీమలో అడిగారన్నారు. నిజానికి కోనసీమపై బ్రిటీష్ ప్రభావం కంటే అక్కడి వారి సంస్కృతి ప్రభావం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-05-25T19:52:06+05:30 IST