పొత్తులపై Pawan Kalyan నర్మగర్భ వ్యాఖ్యల అర్థమేంటి?

ABN , First Publish Date - 2022-06-21T02:30:18+05:30 IST

ఏపీ (AP)లో పొత్తుల గురించి హాట్ టాపిక్ నడుస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రకాశం జిల్లా పర్యటనలో ..

పొత్తులపై Pawan Kalyan నర్మగర్భ వ్యాఖ్యల అర్థమేంటి?

అమరావతి/హైదరాబాద్: ఏపీ (AP)లో పొత్తుల గురించి హాట్ టాపిక్ నడుస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) బాపట్ల (Bapatla) జిల్లా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ప్రజలతోనే జనసేన పొత్తు ఉందని... భవిష్యత్తు పరిణామాలను బట్టి ఆలోచిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో ప్రత్యేక హోదా (Special Status)కు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రప్రభుత్వం (Central Government) ప్రకటించినపుడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శించిన పవన్.. 2019 ఎన్నికల్లో బీఎస్పీ (Bsp)తో కలిసి పోటీ చేశారు. ఆ సమయంలో పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. పార్టీలో ఒకరు తప్ప మిగిలిన వారెవరూ కూడా గెలుపొందలేకపోయారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలుంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పొత్తులకు వెళ్తారా?.. లేదా ఒంటరిగా పోటీ చేస్తారా అనే ఉత్కంఠ రాజకీయ పార్టీల్లో కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తులు ఖాయమనే సంకేతాలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రజలతోనే పొత్తు అని వ్యాఖ్యానించడం వెనుక పవన్ వ్యూహమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 



ఈ నేపథ్యంలో ‘‘పొత్తులపై పవన్ నర్మగర్భ వ్యాఖ్యల అర్థమేంటి?. ప్రత్యేక హోదా తనను దెబ్బకొట్టిందని ఫీలవుతున్నారా?. హోదా కోసం బీజేపీతో విభేదించి ఎలా నష్టపోయారు?. టీడీపీకి దూరమవడం వలన ఎదురైన నష్టమేంటి?. ప్రజలతోనే పొత్తు అనడం వెనుక వ్యూహమేంటి?’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు..





Updated Date - 2022-06-21T02:30:18+05:30 IST