పవన్ కల్యాణ్ దీక్ష విరమణ

ABN , First Publish Date - 2021-12-12T22:54:36+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ జననేన అధినేత పవన్‌కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసింది. ఆయనకు నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. స్టీల్ ప్లాంట్ ..

పవన్ కల్యాణ్ దీక్ష విరమణ

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ జననేన అధినేత పవన్‌కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసింది. ఆయనకు నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. స్టీల్ ప్లాంట్ జేఏసీ నేతలు కూడా పవన్‌తో పాటు దీక్షలో పాల్గొన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని పవన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 


కాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆదివారం ఉదయం సంఘీభావ దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులర్పించారు. అలాగే విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దీక్ష విరమించిన అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 





Updated Date - 2021-12-12T22:54:36+05:30 IST