#GoodMorningCMSir అంటూ గతుకుల రోడ్లపై నాదెండ్ల వ్యంగ్య కామెంట్లు

ABN , First Publish Date - 2022-09-21T14:18:14+05:30 IST

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

#GoodMorningCMSir అంటూ గతుకుల రోడ్లపై నాదెండ్ల వ్యంగ్య కామెంట్లు

అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla manohar) ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. #GoodMorningCMSir అంటూ గతుకుల రోడ్ల వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ‘‘ఆర్థికం అద్బుతం ! స్కూల్స్ సూపర్ ! ఉద్యోగాల కల్పన వండర్ ఫుల్ ! అని మీకు మీరే అసెంబ్లీలో సర్టిఫికెట్స్ ఇచ్చుకొన్నారు కదా. మరి రోడ్లు ఎంత గొప్పగా ఉన్నాయో ఓ మాట చెప్పాల్సింది!. రోడ్ల మీద ప్రయాణిస్తున్నామో, గోతుల్లో ప్రయాణిస్తున్నామో అర్థం కావడం లేదు జగన్ గారూ’’ అంటూ నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. 


కాగా... రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లను బాగుచేయాలంటూ ప్రభుత్వాన్ని, అధికారులను ప్రజలు వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-09-21T14:18:14+05:30 IST