
అమరావతి: వడ్డేశ్వరం వద్ద శ్రమదానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంతలు పడిన రోడ్లకు జనసేనాధిపతి మరమ్మతులు చేశారు. పార, గమేళా చేతబట్టి స్వయంగా మట్టిని పోశారు. కార్యక్రమం ప్రారంభంలో ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో స్థానిక జనసేన నాయకులు కిందపడిపోయారు. దీంతో ప్రశాంతంగా ఉండాలని అభిమానులకు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పారు.