
విజయవాడ: బాధిత పక్షాలకు అండగా నేనున్నానని జనసే(Janasena)న అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) జనవాణి జనసేన పేరుతో భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్(Potina venkata mahesh) తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనసేన జనవాణి జరుగుతుందని వెల్లడించారు. ఈ వేదిక ద్వారా బాధిత ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, ప్రజాసంఘాలకు అండగా నిలుస్తారన్నారు. సమస్య ఏదైనా ఎవరిదైనా పార్టీలకు అతీతంగా అండగా నిలబడి వారి సమస్యలకు పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని చెప్పారు. సామాన్య ప్రజల సమస్యలు వినడానికి అధికార పార్టీ నాయకులకు తీరికలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి(Jagana mohan reddy)కి ప్రజాసమస్యలు పరిష్కరించాలన్న దృష్టి లేదని విమర్శించారు. అందుకే వారు బయటకు రావడం లేదని... ప్రజలు వెళ్లినా కలవడం లేదని అన్నారు. జనవాణి జనసేన కార్యక్రమానికి పేదలు వచ్చి అర్జీలు ఇవ్వవచ్చని పోతిన వెంకట మహేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి