గృహ సముదాయాల్లో కరోనా ఐసోలేషన్ కేంద్రాలా?: పోతిన

ABN , First Publish Date - 2021-04-23T18:48:13+05:30 IST

గృహ సముదాయాల్లో కరోనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు.

గృహ సముదాయాల్లో కరోనా ఐసోలేషన్ కేంద్రాలా?: పోతిన

విజయవాడ: గృహ సముదాయాల్లో కరోనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై  జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. 10,000 సామాన్య, మధ్య తరగతి మహిళల సొంత ఇంటి కలను కరోనా వైరస్‌తో  దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రజలు ఎలా ఉంటారని నిలదీశారు. పేద ప్రజలు గృహప్రవేశాలు ఎప్పటికైనా చేస్తారా అని అన్నారు. కరోనా ఇసోలేషన్ కేంద్రాలను ఇండోర్ స్టేడియం, కళ్యాణ మండపాలలో పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘పేద, సామాన్య, మధ్యతరగతి మహిళలకు న్యాయం చేయగలరని మా విజ్ఞప్తి’’ అని పోతిన వెంకట మహేష్ అన్నారు.

Updated Date - 2021-04-23T18:48:13+05:30 IST