ఇంటి పన్ను కడుతుంటే చెత్త పన్ను ఎందుకు?

ABN , First Publish Date - 2022-05-29T03:54:11+05:30 IST

ప్రజలు ఇంటి పన్ను చెల్లిస్తుంటే ప్రత్యేకంగా చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని జనసేన నగర నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇంటి పన్ను కడుతుంటే చెత్త పన్ను ఎందుకు?
ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), మే 28: ప్రజలు ఇంటి పన్ను చెల్లిస్తుంటే ప్రత్యేకంగా చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని జనసేన నగర నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం నగరంలోని మైపాడు గేటు ప్రాంతం రాజీవ్‌ గాంధీ కాలనీలో నిర్వహించిన పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పన్ను అంటే మున్సిపల్‌ వ్యవస్థ ద్వారా మన ఇంటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం తీసుకునే నగదన్నారు. ఇంటి పన్ను చెల్లించేందుకు చెత్త కుండీలు, రోడ్లు, కాలువల నిర్వాహణ ఇలా పనులు మున్సిపల్‌ అధికారులు ప్రజలకు కల్పించాల్సి ఉందన్నారు. అయితే రోడ్లు, డ్రైనేజీ, చెత్త ఇలా అన్నింటిని వేరు చేస్తూ వాటికి పన్నులు వేస్తూ ప్రజల్పి పిండి పిప్పి చేస్తున్నారని విమర్శించారు. అసలు కార్పొరేషన్‌లో వసూలవుతున్న ఇంటి పన్నులను ఏమి చేస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-29T03:54:11+05:30 IST