
అమరావతి: జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నియామించారు. జనసేన శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలు, కేసులను ఎదుర్కొనేందుకు న్యాయపరంగా అవసరమైన సలహాలు, అండదండల కోసం ప్రత్యేకంగా న్యాయ విభాగాన్ని పవన్ ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో న్యాయవాదులతో లీగల్ సెల్ ప్రకటించారు. ఇప్పటికే లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్‌గా ఈవన సాంబశివ ప్రతాప్ ఎన్నుకున్నారు. తాజాగా వైస్ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు జాబితాను విడుదల చేశారు.