పవన్‌ కల్యాణ్‌కు మంత్రి పేర్ని నాని బేషరతుగా క్షమాపణ చెప్పాలి

Sep 28 2021 @ 00:21AM

 బండ్రెడ్డి రామకృష్ణ డిమాండ్‌

మచిలీపట్నం టౌన్‌ : అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని తక్షణమే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మచిలీపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు.   కోట్లాది అభిమానులు ఉన్న పవన్‌ కల్యాణ్‌పై  మంత్రి పదవిలో ఉన్న పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రెండేళ్లయినప్పటికీ బందరుకు మంత్రి పేర్ని నాని ఏమి చేశారని,   కాపులకు  ఏ పదవులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మచిలీపట్నం నియోజక వర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, పేర్ని నాని విలువలతో కూడిన రాజకీయం చేయ డం మంచిదన్నారు. క్రమశిక్షణ కోరుకోవడం వల్ల జనసేన పార్టీ కార్యకర్తలు సహనంతో ఉన్నారని, కార్యకర్తలను రెచ్చగొట్టవద్దన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, పెదయాదర సర్పంచ్‌ గళ్లా తిమోతి, వి.రమాదేవి పాల్గొన్నారు.

 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.