Pawan Kalyan: కులం చూసుకుని రాజకీయం చేసుంటే అన్ని సీట్లు వచ్చి ఉండేవన్న పవన్..

ABN , First Publish Date - 2022-08-15T21:02:20+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవం (independence day) వేళ జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) గత ఎన్నికల ఫలితాలపై..

Pawan Kalyan: కులం చూసుకుని రాజకీయం చేసుంటే అన్ని సీట్లు వచ్చి ఉండేవన్న పవన్..

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం (independence day) వేళ జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) గత ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులం చూసుకుని రాజకీయం చేస్తే తనకు 40 సీట్లు వచ్చేవని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ (ycp) నేతలు వాళ్ల భావాలను తమపై రుద్దడం సరికాదని జనసేనాని హితవు పలికారు. ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరికాదని పవన్‌ (Pawan) అభిప్రాయపడ్డారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని ఆయన చెప్పారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలని తెలిపారు. మసీదు, చర్చికి అపవిత్రం జరిగితే ఏ విధంగా ఖండిస్తామో ఆలయాలకు అపవిత్రం జరిగినా బలంగా ఖండిస్తేనే సెక్యులరిజమని (secularism) పవన్ కుండబద్ధలు కొట్టారు. జనసేన (Janasena) అధికారంలోకి వస్తే వ్యవస్థల్ని బలోపేతం చేస్తుందని చెప్పుకొచ్చారు.



వైసీపీ నేతలు (YCP Leaders) ఢిల్లీ (Delhi) వెళ్లి ఏం చేస్తారో తనకు తెలుసని, మభ్య పెట్టే రాజకీయాలపై ప్రజల్లో మార్పు రాకపోతే ఏం చేయలేమని పవన్ (Pawan Kalyan) నిట్టూర్చారు. చొక్కా పట్టుకుని అడిగే విధానం ప్రజల్లో రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. ప్రజలకు అధికారులు జవాబుదారీ కావాలని, వైసీపీ నేతలకు కాదని ఆయన స్పష్టం చేశారు. మీరు కేసులు పెడితే భవిష్యత్‌లో మీపై కూడా ఉంటాయని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్‌ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు (ysrcp mlas) ప్రజలే బుద్ధి చెప్తారని పవన్‌ (Pawan) విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో (Vizag) పరిశ్రమలు, ఆక్వా వల్ల నీరు, భూమి కలుషితం అవుతున్నాయని, కాలుష్యం నుంచి విశాఖను కాపాడటమే జనసేన బాధ్యత అని పవన్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-08-15T21:02:20+05:30 IST