అక్షరాస్యతలోనూ అంతరాలే...

ABN , First Publish Date - 2020-03-06T06:00:40+05:30 IST

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో బేటీ పడావో.. నినాదాల అమలుకు చిత్తశుద్ధిగా కృషి చేయడం దేశాభివృద్ధికి ఎంతైనా అవసరం. పురుషాధిక్య సమాజంలో స్ర్తీల పట్ల కొనసాగుతున్న...

అక్షరాస్యతలోనూ అంతరాలే...

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో బేటీ పడావో.. నినాదాల అమలుకు చిత్తశుద్ధిగా కృషి చేయడం దేశాభివృద్ధికి ఎంతైనా అవసరం. పురుషాధిక్య సమాజంలో స్ర్తీల పట్ల కొనసాగుతున్న వివక్షతల్లో అక్షరాస్యత కూడా ఒక అంశంగా ఉంది. ఇది సామాజికంగా మనకు ఎంతో నష్టం కలిగిస్తోంది. మన సమాజంలో స్త్రీలతో పోల్చినప్పుడు పురుషుల అక్షరాస్యత ఎక్కువే అని మనకు తెలిసిన విషయమే. మహిళల విద్య పట్ల మనం చూపుతున్న వివక్షకు ఇది స్పష్టమైన నిదర్శనం. 2011 నాటికి స్త్రీలలో 58 శాతం అక్షరాస్యులుండగా, పురుషుల్లో 70 శాతం అక్షరాస్యులున్నారు. గత రెండు దశాబ్దాలుగా బాలికా విద్యను ప్రోత్సహించడంపై అవగాహన పెరుగుతోంది. దానితో బాలికలూ బడికి పోతున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల బడి మానేస్తున్న బాలికల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. కాలేజీ చదువుల దగ్గర కొచ్చే సరికి వీరి సంఖ్య మరింత తగ్గుతూండడం గమనార్హం. అయితే, సమాజంలోనూ తల్లిదండ్రుల దృక్పథంలోనూ ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. బాలికల విద్య పట్ల వారి ఆలోచనలు మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా ఉన్నత చదువుల వైపు వెళుతున్నారు. 

మారుతున్న కాలంతో పాటు, మన దృష్టిలోనూ మార్పు రావాలి. కుటుంబాల ఎదుగుదలకు, సమాజ అభివృద్ధికి మహిళా అక్షరాస్యత అత్యంత అవసరం అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దాన్ని ఆచరణలో పెట్టడానికి చైతన్యవంతమైన కృషి చేయాలి.


– సయ్యద్ షఫీ, హన్మకొండ

Updated Date - 2020-03-06T06:00:40+05:30 IST