రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: ఐలయ్య

Oct 14 2021 @ 07:53AM

సిద్ధిపేట/అక్కన్నపేట: అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య గారి అధ్యక్షతన మండలంలోని పంతులు తండాలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని, బూత్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. పంతులు తండా గ్రామ శాఖ అధ్యక్షులుగా కరోంటోతూ రాజేందర్, ఉపాధ్యక్షులుగా భూక్యా లాలు,కార్యదర్శిగా బానోత్ శ్రీరామ్, సహాయ కార్యదర్శిగా లకావత్ తిరుపతి, జాటోతూ రాజు, బానోతు శ్రీనివాస్, లకావత్ రమేష్‎లను బూత్ కమిటీ మెంబర్స్‎గా ఎన్నుకొన్నారు. కరోంటోత్ రామన్నను గ్రామ యూత్ మెంబర్‎గా ఎన్నుకోవడం జరిగిందని ఐలయ్య తెలిపారు.

అనంతరం మీడియాతో ఐలయ్య మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావాలంటే మనందరం కూడా దానికి తగినట్టు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా నూతన కార్యవర్గాలు పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో కట్కూర్ సింగిల్విండో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, మల్లంపల్లి మాజీ యంపిటిసి మ్యాక రమేష్, బంధారం శ్రీనివాస్, పొడిశెట్టి వెంకన్న, కరోంటోతూ కిషన్, కరోంటోతూ రవీందర్, కరోంటోతూ సదర్ లాలు, జాటోత్ స్వామి, లావుడ్యా సారయ్య, కరోంటోతూ రాజు, మాలోతు రాజు, లావుడ్యా ఈర్య నాయక్, భూక్యా శివాలాల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: