Janmashtami 2022: ఇవాళ పబ్లిక్ హాలిడేనా.. బ్యాంకులకు సెలవా లేదా తెరిచే ఉంటాయా..?

ABN , First Publish Date - 2022-08-19T17:11:41+05:30 IST

శ్రీ కృష్ణ జన్మాష్టమిని (Janmashtami) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. మథుర (Mathura), బృందావన్‌లో (Vrindavan) అయితే జన్మాష్టమి సంబరాలు..

Janmashtami 2022: ఇవాళ పబ్లిక్ హాలిడేనా.. బ్యాంకులకు సెలవా లేదా తెరిచే ఉంటాయా..?

శ్రీ కృష్ణ జన్మాష్టమిని (Janmashtami) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. మథుర (Mathura), బృందావన్‌లో (Vrindavan) అయితే జన్మాష్టమి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కృష్ణుడు (Lord Krishna) పుట్టింది, పెరిగింది అక్కడే అని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఒక్కరోజే జరుపుకునేవారు. కానీ.. ఈ సంవత్సరం అష్టమి తిథి (Ashtami Tithi) 18వ తేదీ రాత్రి 9 గంటల 21 నిమిషాలకు ప్రారంభమై 19న రాత్రి 11.40 నిమిషాల వరకూ ఉంటుంది. అందుకే.. కృష్ణాష్టమిని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం, మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ (శుక్రవారం) జరుపుకుంటున్నారు. అయితే.. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా.. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు (Schools), కళాశాలలు (Colleges), వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే (Public Holiday) ప్రకటించారు. జన్మాష్టమి సందర్భంగా బీహార్, ఛండీగర్, ఛత్తీస్‌ఘడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్ము మరియు కశ్మీర్, జార్ఖండ్, మిజోరాం, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిస్సా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సెలవు ప్రకటించారు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 18న, మరికొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 19న సెలవు దినంగా ప్రకటించడంతో కొంత గందరగోళం ఏర్పడింది.



ఆర్‌బీఐ క్యాలెండర్ (RBI Calendar) ప్రకారం.. జన్మాష్టమి సందర్భంగా కమర్షియల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (Banks) కొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 18న, మరికొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 19న, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 20న బ్యాంకులు మూతపడతాయని స్పష్టమైంది. ఒడిస్సా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగస్ట్ 18న జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగర్, తమిళనాడు, సిక్కిం, రాజస్తాన్, జమ్ము, బీహార్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లో జన్మాష్టమి సందర్భంగా ఆగస్ట్ 19న బ్యాంకులు బంద్ అయ్యాయి. ఆగస్ట్ 20న తెలంగాణలో బ్యాంకులు మూతపడనున్నాయి.

Updated Date - 2022-08-19T17:11:41+05:30 IST