ఐఐటీహెచ్‌లో జపాన్‌ డే

ABN , First Publish Date - 2022-09-25T05:14:10+05:30 IST

జపాన్‌కు చెందిన స్టార్ట్‌పలు, కార్పొరేట్‌ సంస్థలు ఐఐటీహెచ్‌ విద్యార్థులను ఆకర్షించడానికి శనివారం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌)లో 5వ విడత జపాన్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఐఐటీహెచ్‌లో జపాన్‌ డే
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి

ఈవెంట్‌లో పాల్గొన్న 10 జపనీస్‌ సంస్థలు

కంది, సెప్టెంబరు 24 : జపాన్‌కు చెందిన స్టార్ట్‌పలు, కార్పొరేట్‌ సంస్థలు ఐఐటీహెచ్‌ విద్యార్థులను ఆకర్షించడానికి శనివారం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌)లో 5వ విడత జపాన్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. 2018 నుంచి జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెట్రో) ఐఐటీహెచ్‌ సహకారంతో అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి జాబ్‌ మేళాను నిర్వహిస్తూ, ఐఐటీహెచ్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన ఈ జపాన్‌ డే ఈవెంట్‌ ఈ సారి ప్రత్యక్షంగా జరిగింది. ఈ జపాన్‌డేలో డెన్సో, ప్రో డమ్మీ, మెర్కరీ, ఐయామ్‌ బిసైడ్‌యూ, ఏడబ్ల్యూఎల్‌, అసాహి కసీ కార్పొరేషన్‌, ఎసిల్లా, తకసాగో ఎలకో్ట్ర, ఫుజిట్స్‌ లిమిటెడ్‌, డెనా కార్పొరేషన్‌ వంటి 10 జపనీస్‌ కార్పొరేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. ఈ కంపెనీలు తమ ప్రత్యేకతలను, ఉత్పత్తుల వివరాలను, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలను, పరిశోధనల గురించి ఈ జపాడేలో ఐఐటీహెచ్‌ విద్యార్థులకు వివరించాయి. డిసెంబర్‌లో ఐఐటీహెచ్‌లో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జెట్రో డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుతాహి వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ జపాన్‌లో ఉద్యోగంతో పాటు పని చేయాలనే సంస్కృతిని విద్యార్థులు అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Updated Date - 2022-09-25T05:14:10+05:30 IST