37 ఏళ్ల పాటు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు! అంతా ఓవర్ అనుకుంటుంటే..

ABN , First Publish Date - 2021-09-18T01:31:04+05:30 IST

ఇన్నాక్కొందా సందేశం.. ఆశ్చర్యపోయిన స్థానికులు

37 ఏళ్ల పాటు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు! అంతా ఓవర్ అనుకుంటుంటే..

ఇంటర్నెట్ డెస్క్: ముప్ఫై ఏడేళ్ల కిత్రం జరిగిందీ ఘటన. అప్పట్లో జాపాన్‌లోని ఓ హైస్కూల్ విద్యార్థుల బృందం.. వివిధ భాషాల్లో ఓ సందేశాన్ని చిట్టీలపై రాసి బాటిళ్లలో పెట్టి సీల్ చేసింది. ఇది దొరికిన వారు మమ్మల్ని సంప్రదించండి అంటూ విద్యార్థులు చిట్టీలపై రాసుకొచ్చారు. ఆ తరువాత బాటిళ్లను సముద్రంలోకి వదిలారు. ఇలా మొత్తం 750 బాటిళ్లలో సందేశాలను పంపించారు.  ఆ తరువాత ఈ సీసాలను దొరికిన వారు ఆ స్కూల్ విద్యార్థుల బృందాన్ని సంప్రదించారు. 2002లో చివరిసారిగా ఇటువంటి బాటిల్ ఒకటి  జపాన్‌లోని కగొషిమీ ప్రిఫెక్చర్‌లో దొరికింది. ఇక నాటి నుంచీ..ఒక్క సీసా కూడా లభ్యం కాలేదు. దీంతో..ఈ కథ ముగిసిపోయిందని ఆ హైస్కూల్ వారు అనుకున్నారు. 

ఇవీ చదవండి:

చెట్టెక్కిన కోతి కనకవర్షం కురిపిస్తే..లబోదిబోమన్న లాయర్

ఫ్రెండ్ భార్యతో ప్రేమాయణం.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇలా..


ఇటువంటి సమయంలో ఈ ఏడాది జూన్‌లో హవాయ్‌ ద్వీపంలో మరో సీసా లభ్యమైంది. సముద్రం ఒడ్డున ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలిక ఆబీ గ్రాహమ్‌కు ఇది దొరికింది. దీన్ని చూసి స్థానికులు ఆవాక్కయ్యారు. ఈ విషయం ఆ జపాన్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు తెలిసి ఆమె కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందేశం దాదాపు 37 ఏళ్ల పాటు 6 వేల కిలోమీటర్ల ప్రయాణించిందని పేర్కొన్నారు. అయితే.. ఈ సందేశాలను పంపించిన విద్యార్థుల సైన్స్ క్లబ్ 1984లోనే మూతపడింది. అప్పటి బృందంలో సభ్యురాలైన మయూమీ కొండో మాట్లాడుతూ.. ఈ ఘటనతో పాత జ్ఞాపకాలు మళ్లీ మదిలో మెదిలాయంటూ మురిసిపోయారు. కాగా.. ఈ సీసాలోని కాగితం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందట. 

Updated Date - 2021-09-18T01:31:04+05:30 IST