Japan PM: కరోనా బారినపడిన జపాన్ ప్రధాని

ABN , First Publish Date - 2022-08-21T22:12:39+05:30 IST

జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (Fumio Kishida) కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో

Japan PM: కరోనా బారినపడిన జపాన్ ప్రధాని

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (Fumio Kishida) కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉన్న ఆయన చికిత్స తీసుకుంటున్నారు. వారం రోజుల వెకేషన్‌కు వెళ్లిన ప్రధాని ఇటీవలే టోక్యో చేరుకున్నారు. శనివారం నుంచి ఆయన దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో ఆదివారం ఉదయం పీసీఆర్ టెస్టు నిర్వహించారు. అందులో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.


జులై, ఆగస్టు నెలల్లో జపాన్‌లో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. అయితే, మరణాలు చాలా తక్కువగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌ ఈ ఆర్థిక  సంవత్సరం రెండో త్రైమాసికంలో వార్షికంగా 2.2 శాతం వృద్ధి సాధించింది. కాగా, జపాన్ ప్రధాని కిషిడా శుక్రవారం టునీషియాలో జరగనున్న టోక్యో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ (TICAD)లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొంటారు. అనంతరం మధ్యప్రాచ్యంలో పర్యటిస్తారు.   

Updated Date - 2022-08-21T22:12:39+05:30 IST