ఒమైక్రాన్ ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులపై జపాన్ తాజా నిర్ణయం ఇదీ..!

Nov 29 2021 @ 15:26PM

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్.. ఒమైక్రాన్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకు ముందు వేరియంట్లతో పోల్చితే.. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీంతో కరోనా ఆంక్షలను మళ్లీ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆ దేశ ప్రధాని పుమియో కిషిదా ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.