తనని తాను అద్దెకిచ్చుకుని భారీగా సంపాదిస్తున్నాడు.. అతడు చేసేదేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-12T02:01:30+05:30 IST

మంచి సంపాదన కళ్ల చూడాలంటే మామూలు విషయం కాదు! తెలివితేటలు, శ్రమ, అదృష్టం.. ఇలా అన్నీ ఉంటే కానీ.. అనుకున్నది సాధించలేం..కోరుకున్న డబ్బును కళ్లచూడలేం. కానీ.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏమీ చేయకుండానే కోట్లు కళ్ల జూస్తున్నాడు.

తనని తాను అద్దెకిచ్చుకుని భారీగా సంపాదిస్తున్నాడు.. అతడు చేసేదేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మంచి సంపాదన కళ్ల చూడాలంటే మామూలు విషయం కాదు! తెలివితేటలు, శ్రమ, అదృష్టం.. ఇలా అన్నీ ఉంటే కానీ.. కోరుకున్నది సాధించలేం..! కానీ.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏమీ చేయకుండానే లక్షల్లో(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) కళ్ల జూస్తున్నాడు. అదేలా సాధ్యం అంటారా..? తనని తాను అద్దెకిచ్చుకోవడం ద్వారా అతడు కనకరాశులను అందుకుంటున్నాడు. ఇలాంటి వెరైటీ ఐడియాతో విజయం అందుకున్న అతడి పేరు.. షోజీ మొరొమిటో..!


38 ఏళ్ల షోజీ మొరొమిటో 2018లో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మళ్లీ సంపాదనమార్గం ఎలా తొక్కాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అతడికి ఈ వినూత్న ఐడియా మనసులో తళుక్కుమంది. దీంతో.. ట్విటర్‌లో ఓ ప్రకటన చేశాడు. ‘‘నన్ను నేను మీకు అద్దెకిచ్చుకుంటా.. కావాల్సిన వారు సంప్రదించండి..మీకు తోడుగా ఉంటా..’’ అని పేర్కొన్నాడు. దీంతో.. అతడి దశ తిరిగిపోయింది. చూస్తుండగానే నెలనెలా లక్షల్లో సంపాదించడం మొదలెట్టేశాడు.  తనని పిలిచిన వారి ఇంటికివెళ్లాక షోజీ వారితో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడతాడు.. వారు చెప్పేది ఓపిగ్గా వింటాడు.. వారితో పాటూ కూర్చుని భోజనం చేస్తాడు..! ఇలా ‘‘ఏమీ చేయకుండానే’’ అతడు గంటకు కొంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటాడు. బిడియం ఎక్కువగా ఉన్నవారు.. నలుగురితో కలివిడిగా ఉండేందుకు ఇబ్బంది పడేవారు..స్వేఛ్చగా తమ మనసులోని మాటను ఇతరులతో పంచుకోలేని వారు.. షొజీని సంప్రదిస్తారట. అతడితో తమ మనసులోని మాటను పంచుకుని కాస్తంత స్వాంతన పొందుతారట.ఇక షోజీ ఉదంతం తెలిసి ఆశ్చర్యపోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు!



Updated Date - 2022-01-12T02:01:30+05:30 IST