`పోనీటెయిల్`ను బ్యాన్ చేసిన జపాన్ స్కూల్స్.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-12T21:41:25+05:30 IST

విద్యార్థుల ఆహార్యం విషయంలో జపాన్ పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్న నిబంధనలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి

`పోనీటెయిల్`ను బ్యాన్ చేసిన జపాన్ స్కూల్స్.. ఎందుకో తెలిస్తే షాక్!

విద్యార్థుల ఆహార్యం విషయంలో జపాన్ పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్న నిబంధనలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. అయినా వాటి తీరు మారడం లేదు. గతంలో జపాన్ పాఠశాలలు తీసుకొచ్చిన `వైట్ ఓన్లీ అండర్‌వేర్` పాలసీ తీవ్ర విమర్శల పాలైంది. తాజాగా అలాంటిదే మరో నిబంధన అమల్లోకి వచ్చింది. ఆ నిబంధన ప్రకారం ఇకపై జపాన్ విద్యార్థులు పోనీ టైల్స్ వేసుకుని పాఠశాలలకు హాజరు కాకూడదు. 


పోనీటైల్స్ వేసుకోవడం వల్ల యువతుల మెడ భాగం కనబడుతుందని, అందువల్ల ఆయా స్కూల్స్, కాలేజీలలో ఉండే మగవారికి శృంగార భావనలు కలుగుతాయని 2020లో నిర్వహించిన ఓ సర్వేలో తేలిందట. ప్రతి పది స్కూళ్లలో ఒక స్కూల్ ఈ హెయిర్ స్టైల్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పిందట. అందుకే ఇకపై పోనీటైల్స్‌ను నిషేధించాలని జపాన్ పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. 


గతంలో జపాన్ స్కూల్స్ `వైట్ ఓన్లీ అండర్‌వేర్` నిబంధనను కఠినంగా అమలు చేశాయి. రంగు రంగుల అండర్‌వేర్స్ కాకుండా స్కిన్ కలర్‌లో ఉండే వైట్ అండర్‌వేర్స్ మాత్రమే వేసుకోవాలని, అప్పుడే అవి బయటకు కనబడవని పేర్కొంటూ ఆ నిబంధనను అమలు చేశాయి. స్కూల్స్‌కు వెళ్లే విద్యార్థుల అండర్‌గార్మెంట్స్‌‌ను తనిఖీలు కూడా చేయించాయి. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిబంధనను రద్దు చేశాయి. 

Updated Date - 2022-03-12T21:41:25+05:30 IST