ఈ వెరైటీ Ice-Cream చాలా Hot గురూ.. పూర్తిగా తింటే మాత్రం బిల్లు కట్టక్కర్లేదు!

ABN , First Publish Date - 2022-06-23T14:57:45+05:30 IST

Ice-Cream.. చిన్నపెద్ద తేడా లేకుండా దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తయారీ సంస్థలు కూడా ప్రజల అభిరుచులకు తగ్గట్టు.. రకరకాల ఫ్లేవర్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. అన్ని కాలాల్లో ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎండాకా

ఈ వెరైటీ Ice-Cream చాలా Hot గురూ.. పూర్తిగా తింటే మాత్రం బిల్లు కట్టక్కర్లేదు!

ఇంటర్నెట్ డెస్క్: Ice-Cream.. చిన్నపెద్ద తేడా లేకుండా దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తయారీ సంస్థలు కూడా ప్రజల అభిరుచులకు తగ్గట్టు.. రకరకాల ఫ్లేవర్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. అన్ని కాలాల్లో ఇవి అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎండాకాలంలో ఐస్‌ క్రీంకు గిరాకీ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం.. చల్లదనమే. వేసవి కాలంలో కూల్‌గా ఉండే ఐస్ క్రీం ఒక కప్పు తింటే చాలు.. ఆ అనుభూతి వర్ణాతీతం. చల్లదనంతోపాటు స్వీట్‌గా ఉండే ఐస్ క్రీం.. ఓ చోట మాత్రం ప్రజల నోట్లోంచి పొగలు కక్కిస్తోంది. రొటీన్‌కు భిన్నంగా హాట్‌గా స్పైసీగా ఉండే ఆ Ice-Cream‌ను పూర్తి స్థాయిలో తినడానికి అక్కడి ప్రజలు చెమలు కక్కుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. కాగా.. ఇంతకూ ఈ వెరైటీ ఐస్ క్రీం ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



జపాన్‌లో హిరాటా అనేది చిన్న గ్రామం. ఈ విలేజే.. హాట్, స్పైసీ ఐస్‌ క్రీంకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన ఐస్‌ క్రీం.. కాస్త హాట్‌గా ఉంటుంది. అయితే దీన్ని స్పైసీగా మార్చేందుకు.. ఇక్కడి వ్యాపారులు అత్యంత కారంగా ఉండే హబనేరో (Habanero) మిరప పొడిని దానిపై చల్లి.. కస్టమర్లకు అందిస్తారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏటంటే.. కస్టమర్లు ముందుగా తమ ఇష్టప్రకారమే ఈ ఐస్ క్రీంను తింటున్నట్టు కన్ఫర్మేషన్ లెటర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కాగా.. ఐస్ క్రీంను తినేందుకు ముందుకు వచ్చిన కస్టమర్లలో చాలా మంది దీన్ని పూర్తిగా తినలేకపోయారని అక్కడి ప్రజలు అంటున్నారు. అయితే ఈ ఐస్ క్రీంను పూర్తిగా తింటే.. మాత్రం సదరు కస్టమర్ దానికి బిల్లు చెల్లించక్కర్లేదట. ఫుకుషిమా విపత్తు అనంతరం.. ఈ వెరైటీ ఐస్ క్రీంను తయారు చేయడం ప్రారంభించినట్లు సమాచారం. 


Updated Date - 2022-06-23T14:57:45+05:30 IST